Andhra Pradesh : నవంబర్ లో ఏపీ బడ్జెట్ సమావేశాలు

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు నవంబర్ రెండో వారంలో జరిగే అవకాశం ఉంది

Update: 2024-10-18 01:43 GMT

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు నవంబర్ రెండో వారంలో జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టాల్సిన బడ్జెట్ పై అధికారులు కసరత్తులు ప్రారంభించారు. ఆర్థిక శాఖ అధికారులు బడ్జెట్ రూప కల్పనలో ఉన్నారు. త్వరలోనే బడ్జెట్ తేదీల సమావేశాలు కూడా ఖరారు కానున్నాయి. ఈ మేరకు ఆయన అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. జూన్ లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బడ్జెట్ ను ప్రవేశపెట్టలేదు. ఈ నేపథ్యంలో తాము ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో పాటు వివిధ ప్రాజెక్టుల కోసం ప్రత్యేకంగా నిధులను ఈ బడ్జెట్ లో ఏపీ సర్కార్ కేటాయించనుంది.

2.90 లక్షల కోట్లతో...
2.90 లక్షల కోట్ల రూపాయల వ్యయంతో కూటమి ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. ఇందులో సూపర్ సిక్స్ హామీల అమలు కోసం నిధులను ప్రత్యేకంగా కేటాయిస్తుంది. జూన్ నెలలో కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటికీ ఓటాన్ బడ్జెట్ పైనే ఆధారపడింది. పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టలేదు. నవంబరు రెండో వారంలో పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టి శాసనసభ ఆమోదాన్ని పొందాల్సి ఉంది. అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు ఈ బడ్జెట్ లో ప్రాధాన్యత ఇవ్వనున్నారు. సూపర్ సిక్స్ లో ఏం హామీలకు ఈ ఏడాది నిధులు కేటాయిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.


Tags:    

Similar News