ముంబయికి చంద్రబాబు నాయుడు

ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం ముగిసింది అనంతరం ఆయన ముంబయి వెళ్లి రతన్ టాటాకు నివాళులర్పించనున్నారు.;

Update: 2024-10-10 06:17 GMT
cabinet meeting, important decisions, chandrababu, andhra pradesh

 Ap cabinet meeting

  • whatsapp icon

ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం కొద్దిసేపటి క్రితం ప్రారంభమయింది. అయితే రతన్ టాటా మృతికి నివాళులర్పించి మంత్రి వర్గ సమావేశాన్ని ముగించింది. ఎలాంటి అజెండాను చేపట్టకుండా ఆయనకు నివాళిగా కాసేప మంత్రివర్గ సభ్యులందరూ మౌనం పాటించారు. చంద్రబాబు, మంత్రులు రతన్ టాటాకు నివాళులర్పించారు.

మంత్రివర్గ సమావేశంలో నివాళులు...
మరికాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు ముంబయి బయలుదేరి వెళుతున్నారు. ప్రత్యేక విమానంలో ముంబయి బయలుదేరి రతన్ టాటా అంత్యక్రియల్లో పాల్గొంటారు. చంద్రబాబు నాయుడు రతన్ టాటా పార్థీవ దేహానికి నివాళులర్పించనున్నారు. ముంబయికి చంద్రబాబుతో పాటు మంత్రులు కూడా బయలుదేరి వెళుతున్నారు.


Tags:    

Similar News