Andhra Pradesh : మంత్రులకు క్లాస్ పీకిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుంది.;

ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎస్సీ వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది. 617 కోట్ల రూపాయలతో అసెంబ్లీ, 786 కోట్ల రూపాయల వ్యయంతో హైకోర్టు భవనాల నిర్మాణాలకు మంత్రి వర్గం ఆమోదం లభించింది. ఎల్ 1 బిడ్డర్ కు నిర్మాణ పనులను అప్పగించాలని కేబినెట్ నిర్ణయించింది. పట్టణ ప్రాంతాల్లో వరద నిర్వహణకు ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేయాలని సూచించింది. విశాఖపట్నంలోటీసీఎస్ కు 21.66 ఎకరాలు, ఉరుస క్లస్టర్స్ ప్రయివేటు లిమిటెడ్ కు 3.5 ఎకరాలు కేటాయించాలని నిర్ణయించింది.
ఇటీవల పరిణామాలపై...
దీంతో పాటు ఏపీ కేబినెట్ లో ఇటీవలి పరిణామాలపై చర్చ జరిగింది. టీటీడీ గోశాల, వక్ఫ్ చట్టం, పాస్టర్ ప్రవీణ్ మృతిపై చర్చించారు. ప్రతిపక్షం ప్రజలను రెచ్చగొట్టేప్రచారం చేసిందన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మతపరమైన అంశాల్లో ప్రతిపక్షం ఆరోపణలను మంత్రులు ధీటుగా ఎదుర్కోలేకపోతున్నారని చంద్రబాబు క్లాస్ పీకారు. ఇలాంటి అంశాలపై మంత్రులు వెంటనే స్పందించాలన్న ముఖ్యమంత్రి మే 2వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ అమరావతిలో పర్యటిస్తారని, అమరావతి పునర్నిర్మాణ పనుల్లో భాగంగా మోదీ పర్యటన ఉంటుందని చంద్రబాబు తెలిపారు. మూడేళ్లలో సచివాలయం, అసెంబ్లీ , హైకోర్టు, రహదారులు పూర్తిచేయాలన్న లక్ష్యం పెట్టుకోవాలని సీఎం చంద్రబాబు తెలిపారు.