Visakha : నేవీ డే కు హాజరయిన చంద్రబాబు కుటుంబం

విశాఖపట్నంలో జరుగుతున్న నేవీ డే వేడుకలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు;

Update: 2025-01-04 12:38 GMT




 


విశాఖపట్నంలో జరుగుతున్న నేవీ డే వేడుకలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఆయన తన కుటుంబ సభ్యులతో కలసి ఈసమావేశానికి హాజరయ్యారు. విశాఖ ఆర్కే బీచ్ లో జరుగుతున్న ఈ నేవీ వేడుకలను వీక్షించేందుకు వేల సంఖ్యలో జనం హాజరయ్యారు. విశాఖ ఆర్కే బీచ్ లో ఇందుకు సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

ప్రదర్శించిన ఇళ్లు...
నేవీ దళం ప్రదర్శించిన విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. దాదాపు ఎనిమిది వేల అడుగుల ఎత్తు నుంచి పారాచూట్ సాయంతో జాతీయజెండాను, నేవీ జెండాను ఎగురవేశారు. సాగర తీరంలో యుద్ధ విమానాలు, నౌకలు,హెలికాప్టర్లు, ట్యాంకర్లు అందరినీ ఆకట్టుకున్నాయి. యుద్ధ విన్యాసాలు అబ్బురపర్చారయి.చంద్రబాబు మనవడు దేవాన్ష్ కూడా ఈ వేడుకలను చూసి ఎంజాయ్ చేశారు.

ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now

Tags:    

Similar News