Chandrababu : భువనేశ్వరి కోసం చీరను కొనుగోలు చేసిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సతీమణి భువనేశ్వరి కోసం పట్టు చీరను కొనుగోలు చేశారు;

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సతీమణి భువనేశ్వరి కోసం పట్టు చీరను కొనుగోలు చేశారు. నిన్న బాపట్ల జిల్లాలో పర్యటించిన చంద్రబాబు చీరాల పట్టు చీరలను చూసి ముగ్గులయ్యారు. డ్వాక్రా మహిళల ఉత్పత్తులను పరిశీలించిన ఆయన ఇలాంటి చీరలకు ఎక్స్ పోర్టు ఉండాలని, సోషల్ మీడియా ద్వారా కూడా చీరను విక్రయించుకోవచ్చని సూచించారు.
పన్నెండు వేలు ఇచ్చి...
మహిళలు తయారు చేసిన స్టాళ్లను పరిశీలించిన చంద్రబాబు జాండ్రపేటకు చెందిన ఒక చేనేత కార్మికురాలు నేసిన చీరకు ఆకర్షితులయ్యారు. ఇది తన సతీమణి భువనేశ్వరికి బాగా నప్పుతుందని భావించిన చంద్రబాబు ఆమె నుంచి చీరను కొనుగోలు చేశారు. చీరను పన్నెండు వేల రూపాయలు ఇచ్చి కొనుగోలు చేశారు. నెలకు కనీసం యాభై వేలు చీరల అమ్మకాలపై సంపాదించాలని ఆ మహిళకు చంద్రబాబు సూచించారు.