Chandrababu Naidu: ట్విట్టర్ లో మరో గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో గుడ్ న్యూస్ చెప్పారు. ఎక్స్ లో ఈ మేరకు పోస్టు చేశారు;

Update: 2024-10-26 03:36 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో గుడ్ న్యూస్ చెప్పారు. ఎక్స్ లో ఈ మేరకు పోస్టు చేశారు. రాష్ట్ర రాజధాని అమరావతిలో పది ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ కన్వెన్షన్‌ సెంటర్‌ను అభివృద్ధి చేసేందుకు హడ్కో ఆసక్తితో ముందుకు వచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.

హడ్కో ఛైర్మన్ తో...
హడ్కో చైర్మన్‌, ఎండీ సంజయ్‌ కులశ్రేష్ఠ నేతృత్వంలోని ప్రతినిధి బృందం ముఖ్యమంత్రితో సమావేశమైంది. ఈ సమావేశంలో రాజధాని అమరావతి గురించి చర్చించారు. అమరావతి అభివృద్ధిపై వారు చర్చించారు.ప్రధానంగా అమరావతిలో రాజధాని నిర్మాణానికి 11 వేల కోట్ల ఆర్థిక సహాయ ప్యాకేజీపై చర్చలు సాగినట్లు చంద్రబాబు ’ఎక్స్‌’ వేదికగా వెల్లడించారు.



Tags:    

Similar News