Chandrababu : రేపు ఢిల్లీకి చంద్రబాబు నాయుడు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీకి బయలుదేరి వెళుతున్నారు.;

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీకి బయలుదేరి వెళుతున్నారు. రేపు రాత్రికి ఢిల్లీకిచేరుకోనున్న ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. రాష్ట్రానికి రావాల్సిన నిధులతో పాటు కొన్ని కీలకమైన ప్రాజెక్టులకు సంబంధించిన పురోగతిపై కేంద్ర మంత్రులపై చర్చించనున్నట్లు తెలసింది.
విదేశాలకు...
అయితే ఎవరెవరిని కలవనున్నారన్న దానిపై ఇంకా క్లారిటీ రాకపోయినా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తో పాటు కేంద్రహోం హోంమంత్రి అమిత్ షా, జలవనరుల శాఖ మంత్రితో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఢిల్లీ నుంచి చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారని అధికారిక వర్గాలు వెల్లడించాయి.