Chandrababu : నాటి ఓటమికి నేనే కారణమన్న చంద్రబాబు
అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.;

అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2047 విజన్ డాక్యుమెంట్ పై చర్చ సందర్భంగా ఆయన ఎన్నికల్లో ఓటమికి గల కారణాలను సభకు తెలియచేశారు. 2004,2019లో తను ఎవరూ ఓడించలేదని, ఆ ఎన్నికల్లో ఓటమికి తానే కారణమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.
అధికారంలో ఉన్నప్పుడు...
అధికారంలో ఉన్నప్పుడు కొన్ని పనులు చేయలేకపోవడం వల్లే ఓడిపోయామన్న చంద్రబాబు నాయుడు పనిలో పడి పార్టీ, ఎమ్మెల్యేలను సమన్వయం చేయలేకపోయానని అంగీకరించారు. అందుకే నాడు టీడీపీ ఓటమి పాలయిందని తెలిపారు. ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపితే ఓటమి ఉండదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు.