Chandrababu : ఎన్డీఏ పక్ష సమావేశంలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు;

Update: 2024-09-18 13:00 GMT
chandrababu naidu, chief minister, key remarks, nda legislative party meeting
  • whatsapp icon

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. మూడు కాంబినేషన్‌తో నే అధికారంలోకి రాగాలిగామన్నారు. కూటమి ఏర్పడటానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎంత కారణమో, బీజేపీ అధ్యక్షురాలు అంతే కారణమని అన్నారు. పురంద్రీశ్వరి కాకుండా వేరే వారు అధ్యక్షులుగా ఉంటే కూటమి ఏర్పాటు జరిగేదా? అన్న అనుమానం కూడా కలుగుతుందన్నారు. తాను జైల్లో ఉన్నప్పుడే పవన్ కల్యాణ్ పొత్తును ప్రకటించారన్నారు. సీట్ల విషయంలోనూ అందరినీ ఒప్పించి, మెప్పించి ఎలాంటి పొరపచ్చాలు లేకుండా ఎన్నికలకు వెళ్లగలిగామని తెలిపారు. మొదటి సారిగా 93 శాతం స్ట్రయింగ్ రేటు రావడం ఇదే మొదటిసారి అని చంద్రబాబు అన్నారు. ఏనాడూ రానంత విజయం వచ్చిందంటే అందుకు మూడు పార్టీలు అనుసరించిన విధానమే కారణమని తెలిపారు. అభ్యర్థుల ఎంపిక నుంచి పార్టీ ప్రచారం వరకూ అందరూ కష్టపడ్డారని చంద్రబాబు ప్రశంసించారు.

మూడు పార్టీల కలయిక...
రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు వెళతామని తెలిపారు. ఈ మూడు పార్టీల కలయిక శాశ్వతంగా ఉండాలని కోరుకుంటున్నానని చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం సహకారం లేకపోతే రాష్ట్రంలో అభివృద్ధి జరగదని చంద్రబాబు అన్నారు. ఎమ్మెల్యేలు కూడా ప్రజాభిప్రాయానికి అనుగుణంగా పనిచేయాలన్నారు. ప్రజలు మనకు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ వారి సమస్యలను ఎప్పటికప్పుడు అడ్రస్ చేస్తూ వారికి అండగా నిలబడాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం లభిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో సద్వినియోగం చేసుకోవాలని చంద్రబాబు కోరారు. కేంద్రాన్ని ఒప్పించి ప్రతి ఇంటికీ జలజీవన్ మిషన్ ద్వారా సురక్షితమైన మంచినీరు అందిస్తామని తెలిపారు. కేంద్రం నుంచి నిధులు తెచ్చేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తామని చంద్రబాబు తెలిపారు. వికసిత్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా అందరూ పనిచేయాలని చంద్రబాబు పిలుపు నిచ్చారు.



Tags:    

Similar News