Chandrababu : నేడు పోలవరానికి చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు పోలవరం ప్రాజెక్టు వద్దకు రానున్నారు.;

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు పోలవరం ప్రాజెక్టు వద్దకు రానున్నారు. ప్రాజెక్టు పనులను పరిశీలించనున్నారు. ఉదయం పదకొండు గంటలకు నేరుగా అమరావతి నుంచి బయలుదేరి పోలవరం ప్రాజెక్టుకు చేరుకుంటారు. పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలన్న లక్ష్యంతో చంద్రబాబు నాయుడు పోలవరంపై ప్రత్యేక దృష్టి పెట్టారు.
పనుల పురోగతిపై...
అందులో భాగంగానే నేడు చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని స్వయంగా పరిశీలించనున్నారు. దీంతో పాటు ప్రాజెక్టు వద్ద ఉన్న డయాఫ్రం వాల్ ను పరిశీలస్తారరు. అాగే భూసేకరణతో పాటు పునరావసంపై అధికారులతో ఆయన సమీక్ష చేయనున్నారు. పోలవరం పనులకు సంబంధించిన గతంలో ఆయన విధించిన డెడ్ లైన్ ప్రకారం పనులు జరుగుతున్నాయో లేదో సమీక్షలో అధికారులను అడిగి తెలుసుకుంటారు. చంద్రబాబు పోలవరం పర్యటనకు వస్తుండటంతో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.