Chandrababu : నేడు తాడికొండకు చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు గుంటూరు జిల్లాలోని తాడికొండలో పర్యటించనున్నారు.;

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు గుంటూరు జిల్లాలోని తాడికొండలో పర్యటించనున్నారు. నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యదక్రమాల్లో చంద్రబాబు పాల్గొననున్నారు. అధికారులతోనూ సమావేశమై నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను గురించి చర్చించనున్నారు. వాటి పరిష్కానికి తీసుకోవాల్సిన చర్యలపై ఆయన అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు.
ప్రజాసమస్యలను పరిష్కరించే దిశగా...
ప్రజా సమస్యలను తాడికొండ నియోజకవర్గంలో పరిష్కరించే దిశగా చంద్రబాబు ఈ సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జంయతి ఉత్సవాల్లో పాల్గొననున్నారు. తాడికొండ మండలం పొన్నెకల్లులో అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళలులర్పించనున్నారు. అనంతరం నియోజకవర్గంలో బంగారు కుటుంబాలు - మార్గదర్శితో సమావేశమై చర్చిస్తారు. దీంతో పాటు తాడి కొండ టీడీపీ కార్యకర్తలతో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు.