Chandrababu : చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ఇదే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసింది;

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసింది. ఉదయం పదకొండు గంటలకు సచివాలయానికి చంద్రబాబు నాయుడు వెళ్లనున్నారు. ఉదయం 11.15 నుంచి 01.15 గంటల వరకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు, పాలకవర్గంతో సమీక్ష చేస్తారు.
వివిధ శాఖల సమీక్ష...
వేసవిలో భక్తుల రద్దీకి అనుగుణంగా దర్శనానికి భక్తులు ఇబ్బంది పడకుండా అన్ని చర్యలు తీసుకోవాలని చంద్రబాబు నాయుడు టీటీడీ అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. భక్తులు ఇబ్బంది పడకుండా, వేసవిలో దర్శనం అందరికీ లభించేలా చర్యలు తీసుకోవాలని కోరనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు రాష్ట్రంలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ల ఏర్పాటుపై చంద్రబాబు సమీక్షిస్తారు. సాయంత్రం 6.15 గంటలకు ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు.