నేటి చంద్రబాబు షెడ్యూల్ ఇదే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు;

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి చంద్రబాబు ఉదయం 10.45 గంటలకు సచివాలయానికి రానున్నారు. ఉదయం 11 గంటల నుంచి 01.30 గంటల వరకు జరగనున్న మంత్రి వర్గ సమావేశంలో పాల్గొంటారు.
సింగపూర్ ప్రతినిధులతో...
అనంతరం మధ్యాహ్నం 2.30 గంటలకు సింగపూర్ ప్రతినిధులతో భేటీ అవుతారు. రాజధాని అమరావతిలో స్టార్టప్ ఏరియా అభివృద్ధిలో సింగపూర్ ప్రభుత్వం భాగస్వామ్యులయ్యేందుకు రావడంతో వారితో చర్చించి చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారు. అనంతరం కొన్ని శాఖల అధికారులతో సమావేశమవుతారు. తర్వాత సాయంత్రం 6 గంటలకు ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు.