Andhra Pradesh : నేటి చంద్రబాబు షెడ్యూల్ ఇలా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసింది.;

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసింది. ఉదయం పదకొండు గంటలకు అసెంబ్లీకి చంద్రబాబు నాయుడు రానున్నారు. ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు అసెంబ్లీ సమావేశాలకు చంద్రబాబు నాయుడు హాజరవుతారు.
ఎస్ఐపీబీ సమావేశంలో...
మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 03.30 వరకు ఎస్ఐపీబీ సమావేశంలో చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. వివిధ అధికారులతో సమావేశమై సమీక్షలు జరుపుతారు. ముందుగా అపాయింట్ మెంట్ తీసుకున్న వారితోనూ, కొందరి మంత్రులతో సమావేశం కానున్నారు. అనంతరం సాయంత్రం ఆరు గంటలకు ఉండవల్లి నివాసానికి చంద్రబాబు చేరుకుంటారు.