కడప స్టీల్‌ప్లాంట్‌కు జగన్ భూమి పూజ

కడప స్టీల్ ప్లాంట్ కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు. భూమి పూజను నిర్వహించారు.;

Update: 2023-02-15 06:03 GMT
కడప స్టీల్‌ప్లాంట్‌కు జగన్ భూమి పూజ
  • whatsapp icon

కడప స్టీల్ ప్లాంట్ కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు. భూమి పూజను నిర్వహించారు. ఉదయం కడపకు చేరుకున్న జగన్ నేరుగా సున్నపురాళ్లపల్లి చేరుకుని అక్కడ జిందాల్ స్టీల్ ఫ్యాక్టరీ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. 8,800 కోట్ల రూపాయలతో జిందాల్ సంస్థ ఈ స్టీల్ ప్లాంట్ ను నిర్మించనుంది. వేలాది మందికి ఉపాధి అవకాశాలు దీని ద్వారా లభించనున్నాయి.

నమూనాను పరిశీలించి...
ఈ స్టీల్ ప్లాంట్ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమానికి జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ ఛైర్మన్ జిందాల్ తో పాటు మంత్రులు అమరనాధ్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అంజాద్ భాషాతో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మాణం కానున్న జిందాల్ స్టీల్ ప్లాంట్ నమూనాను జగన్ పరిశీలించారు.


Tags:    

Similar News