కోర్టు కేసుల కారణంగానే ఆలస్యం

కోర్టు కేసుల కారణంగానే ఇళ్ల స్థలాల పంపిణీలో ఆలస్యం జరిగిందని ముఖ్యమంత్రి జగన్ అన్నారు.

Update: 2021-12-24 14:12 GMT

కోర్టు కేసుల కారణంగానే ఇళ్ల స్థలాల పంపిణీలో ఆలస్యం జరిగిందని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. పులివెందులలోని జగనన్న కాలనీలో 8,042 మందికి ఇళ్ల పట్టాలు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ కాలనీలో అన్ని రకాలు సదుపాయాలను కల్పిస్తామని చెప్పారు. ఒక్కొక్క ఇంటిపై ప్రభుత్వం ఆరు లక్షలు ఖర్చు పెడుతుందని జగన్ స్పష్టం చేశారు. ఈ కాలనీకి సమీపలంలోనే ఇండ్రస్ట్రియల్ కారిడార్ వస్తున్నందున ఇంటి విలువ మరింత పెరుగుతుందని జగన్ తెలిపారు.

జగనన్న కాలనీలో....
ఈ సందర్భంగా పులివెందులలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ ప్రసంగించారు. పులివెందులలో డ్రైనేజీ అభివృద్ధికి వంద కోట్లు, మంచినీటి పథకం కోసం 65 కోట్లను మంజూరు చేసినట్లు ప్రజల హర్షధ్వనాల మధ్య జగన్ ప్రకటించారు. నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి మంచినీటి సరఫరా చేస్తామన్నారు. 147 కోట్ల తో జగనన్న కాలనీని అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా లబ్దిదారులకు జగన్ ఇంటి పట్టాలను అందజేశారు.


Tags:    

Similar News