చలించిపోయిన జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన పర్యటనలో మానవత్వాన్ని చాటు కున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన పర్యటనలో మానవత్వాన్ని చాటు కున్నారు. తుని పర్యటనలో ఉన్న జగన్ తనను చూసేందుకు వచ్చిన జనం మధ్యలో ఓ తల్లిని చూసి చలించిపోయారు. మాసనిక వికలాంగుడైన తన కొడుకుతో ఒక తల్లి పడే ఆవేదనను చూసి ఆయన మనసు కరిగిపోయింది. వెంటనే బస్సు ఆపి ఆమెను తన వద్దకు పిలిపించుకున్నారు. ఆమె కష్టాల గురించి తెలుసుకున్నారు. వెంటనే అధికారులకు ఆదేశించారు.
మానసిక వైకల్యంతో...
ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం మండపం గ్రామానికి చెందిన తనూజకు మానసిక వైకల్యం కలిగిన కొడుకు ఉన్నాడు. ప్రభుత్వ సాయం కోసం ఇన్నాళ్లూ ఎదురు చూసిన ఆమె గోడును ఎవరూ పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి జగన్ ఆ దారిన వస్తున్నారని తెలిసి తన కొడుకును తీసుకుని అక్కడకు బయలుదేరింది. తన కొడుకును పైకి చూపుతూ సాయం కోసం అర్థించింది. బస్సులో వెళుతున్న జగన్ ఆ దృశ్యాన్ని చూసి చలించిపోయి వెంటనే బస్సును ఆపి కిందకు దిగారు. తనూజను తన వద్దకు పిలిపించుకున్నారు. సమస్య గురించి అడిగి తెలుసుకున్నారు.
బస్సు ఆపి....
తక్షణ సాయంగా వెంటనే పదివేల రూపాయలు అందించాలని ఆదేశించారు. ఆ బిడ్డకు వికలాంగ పింఛను ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. వెంటనే న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు. వికలాంగ పింఛను ను వెంటనే మంజూరు చేయాలని కోరారు. ఆరోగ్యం మెరుగుపడుతుందేమో వైద్య పరీక్షలు చేయించాలని అధికారులకు సూచించారు. తనూజ తలపై చేయి పెట్టి జగన్ భరోసా ఇచ్చారు. జగన్ చేసిన పనికి సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.