నేడు గవర్నర్ వద్దకు జగన్.. వారిలో టెన్షన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ను కలవనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ను కలవనున్నారు. సాయంత్రం ఐదు గంటలకు ఆయన రాజ‌్‌భవన్ కు వెళ్లి గవర్నర్ ను కలవనున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగియడంతో ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించేందుకు వచ్చిన గవర్నర్ కు ధన్యవాదాలు తెలిపేందుకు మర్యాద పూర్వకంగా కలవనున్నారా? లేక మంత్రి వర్గ విస్తరణపై ఆయన చర్చించనున్నారా? అన్న టెన్షన్ నెలకొంది. ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తి కావడంతో మంత్రి వర్గ విస్తరణ ఉంటుందన్న ప్రచారంతో ప్రస్తుత మంత్రివర్గంలో కొందరికి టెన్షన్ పట్టుకుంది.
రేపు విశాఖకు..
రేపు ముఖ్యమంత్రి జగన్ విశాఖపట్నానికి బయలుదేరి వెళతారు రేపు సాయంత్రం నాలుగు గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి 5.15 గంటలకు విశాఖకు చేరుకుంటారు. అక్కడ సాయంత్రం ఆరు గంటలకు రాడిసన్ బ్లూ రిసార్ట్స్ కు చేేరుకుని జీ 20 ప్రతినిధులతో సమావేశమవుతారు. ప్రత్యేకంగా అతిథుల కోసం ఏర్పాటు చేసిన డిన్నర్ లో పాల్గొని రాత్రికి తిరిగి విశాఖ నుంచి బయలుదేరి తాడేపల్లికి చేరుకుంటారు.