నేడు వైఎస్సార్ కాపునేస్తం విడుదల
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు వైఎస్సార్ కాపునేస్తం నిధులను లబ్దిదారులకు విడుడల చేయనున్నారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు వైఎస్సార్ కాపునేస్తం నిధులను లబ్దిదారులకు విడుడల చేయనున్నారు. ఇందుకు 508.19 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం కేటాయించింది. ఈ పథకం కింద 3,38,792 మంది లబ్ది పొందనున్నారు. రాష్ట్రంలో ఉన్న కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన మహిళల ఖాతాల్లో ఈ నిధులను జమ చేయనున్నారు. ప్రతి ఒక్కరి ఖాతాల్లో రూ. 15,0000 వేయనున్నారు.
జీవన ప్రమాణాలను...
వారి ఆర్థిక జీవన ప్రమాణాలను పెంచడమే లక్ష్యంగా ఈ కాపునేస్తం పథకాన్ని రూపొందింాచరు. మూడో ఏడాది వరసగా ఈ పథకం నిధులను జగన్ విడుదల చేయనున్నారు. ఇందుకు కాకినాడ జిల్లా గొల్లప్రోలులో వేదిక సిద్ధమయింది. అక్కడ బటన్ నొక్కి లబ్దిదారులకు అందజేస్తారు. అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. తిరిగి 12.40 గంటలకు గొల్లప్రోలు నుంచి బయలు దేరి జగన్ తాడేపల్లి చేరుకుంటారు.