ఈ నెల 21న పశ్చిమకు జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెల 21వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు;

Update: 2021-12-11 07:03 GMT
ys jagan, visakhapatnam, development activities, andhra pradesh
  • whatsapp icon

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెల 21వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. తణుకులోని ఆర్ట్స్ కళాశాలలో జరిగే బహిరంగ సభలో జగన్ ప్రసంగించనున్నారు. రాష్ట్రంలో సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని ఈ వేదిక మీద నుంచి ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించనున్నారు. ఈ పథకం ద్వారా 52 లక్షల మంది లబ్దిదారులు ప్రయోజనం పొందనున్నారు.

ఓటీఎస్ పథకం....
ఇప్పటి వరకూ గృహహక్కును పొందని వారు వన్ టైమ్ సెటిల్ మెంట్ ద్వారా హక్కును పొందవచ్చని ప్రభుత్వం తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో పదివేలు, మున్సిపల్ ప్రాంతాల్లో పదిహేనువేలు, కార్పొరేషన్ పరిధిలో ఇరవై వేలు చెల్లించి గృహంపైన సంపూర్ణ హక్కును పొందవచ్చు. లబ్దిదారులు గత కొన్నేళ్లుగా చెల్లించాల్సిన బకాయీలను రద్దు చేసి పూర్తి హక్కును కల్పిస్తారు. పది రూపాయలతో రిజిస్ట్రేషన్ ను కూడా చేస్తారు. ఈ పథకాన్ని పశ్చిమ గోదావరి జిల్లా నుంచి జగన్ ప్రారంభించనున్నారు.


Tags:    

Similar News