నేడు ప్రయాగ్ రాజ్ కు పవన్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేడు మహా కుంభమేళాకు వెళ్లనున్నారు;

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేడు మహా కుంభమేళాకు వెళ్లనున్నారు. ఆయన కుటుంబ సమేతంగా ప్రయాగ్ రాజ్ కు వెళ్లి మహా కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించనున్నారు. ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాలో కుటుంబ సభ్యులతో కలసి స్నానమాచరించిన అనంతరం తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు.
పుణ్యస్నానాలు...
జనసేన అధినేతగా పవన్ కల్యాణ్ సనాతన ధర్మం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టిన నేపథ్యంలో ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళాకు హాజరవుతారని అందరు అనుకున్నదే. ఈ నెల 26వ తేదీతో మహా కుంభమేళా ముగియనుండటంతో నేడు పవన్ కల్యాణ్ వెళ్లి అక్కడ స్నానమాచరించి వస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.