తలనీలాలను సమర్పించిన పవన్ సతీమణి
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా తిరుమల శ్రీవారికి తలనీలాలను సమర్పించుకున్నారు;

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా తిరుమల శ్రీవారికి తలనీలాలను సమర్పించుకున్నారు. తన చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ స్కూలులో జరిగిన అగ్నిప్రమాదం నుంచి బయటపడటంతో ఆమె తిరుమలకు వచ్చి మొక్కులు తీర్చుకున్నారు. స్వల్పగాయాలతో మార్క్ శంకర్ సురక్షితంగా బయటపడటంంతో పవన్ కల్యాణ్ సతీమణి నేరుగా తిరుమలకు వచ్చి బాలాజీని దర్శించుకుననారు.
డిక్లరేషన్ పై సంతకం చేసి...
తిరుమలకు వచ్చిన అన్నాలేజినోవాతొలుత డిక్లరేషన్ పై సంతకం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం నియమాల ప్రకారం ఇతర మతస్తులు తిరుమలకు వచ్చినప్పుడు శ్రీవారిపై తమకు నమ్మకం ఉందంటూ డిక్లరేషన్ ఇవ్వాలి. తర్వాత అన్నా వరాహస్వామిని దర్శించుకున్నారు. ఆమె తలనీలాలను సమర్పించడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈరోజు ఉదయం బ్రేక్ దర్శనంలో అన్నా లెజినోవా స్వామి వారిని దర్శించుకోనున్నారు.