యాభై ఏళ్ల క్రితం చదివినా... మీ టెన్త్ సర్టిఫికేట్ ఆన్ లైన్ లో
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. పదో తరగతి సర్టిఫికెట్లన్నీ ఆన్ లైన్ అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. పదో తరగతి సర్టిఫికెట్లన్నీ ఆన్ లైన్ అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ నిర్ణయించడంతో పూర్వ విద్యార్థులు ఎవరైనా తమ సర్టిఫికెట్ల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. నేరుగా ఆన్ లైన్ నుంచి డౌన్ లోడ్ చేసుకునే వీలుంది.
అనుమతి ఇచ్చిన...
ఏపీలో పదో తరగతి సర్టిఫికెట్లన్నీ ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచాలని పాఠశాల విద్యా శాఖ నిర్ణయించింది. యాభై ఏళ్ల క్రితం టెన్త్ చదివిన వారు కూడా డిజిలాకర్ నుంచి ధ్రువపత్రాలను ఈజీగా డౌడ్ లోడ్ చేసుకోవచ్చు. 1969 నుంచి 1990 సర్టిఫికెట్ల డిజిటైజేషన్ కు తాజాగా విద్యాశాఖ అనుమతినిచ్చింది. ఆ తర్వాత 1991-2003 సర్టిఫికెట్లను డిజిటైజేషన్ చేయనుంది. 2004 తర్వాత పదోతరగతి చదివిన వారివి ఇప్పటికే ఆన్ లైన్ లో అందుబాటులో ఉన్నాయి.