Andhra Pradesh : చంద్రబాబు నాయుడు వారికి గుడ్ న్యూస్ చెప్పేశారుగా
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచిత ఇసుక విధానంపై గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచిత ఇసుక విధానంపై గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కీలక నిర్ణయంతో గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాలు వేగంగా జరుగుతాయని భావిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఇది వాణిజ్య అవసరావల కోసం, లారీలతో తరలించడానికి రవాణా, ఇతర ఖర్చుల కింద అధిక మొత్తంలో చెల్లించాల్సి రావడం విమర్శలకు దారి తీసింది.
ట్రాక్టర్లు, ఎడ్లబండ్లపై...
అయితే ప్రభుత్వం దీనిని గమనించి ట్రాక్టర్లలో, ఎడ్లబండ్లలో తీసుకెళ్లే ఇసుకకు ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపింది. ఈ మేరకు తాజాగా ఆంధ్రప్రదేశ్ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామాల్లో ప్రజలు తమ ప్రాంతంలోని ఇసుకను తాము ఉచితంగా వినియోగించుకునేందుకు ఈ ఉత్తర్వులు ఉపయోగపడనున్నాయి. ఇకపై ఎడ్లబండ్లు, ట్రాక్టర్లపై ఇసుకను తీసుకెళ్లే వారు ఎలాంటి రుసుం చెల్లించకుండా ఉచితంగానే తీసుకెళ్లే వీలు కల్పిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవతో ఈ నిర్ణయం తీసుకున్నారు.