Andhra Pradesh : బీసీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ఏపీ సర్కార్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీసీలకు గుడ్ న్యూస్ చెప్పింది. వడ్డీ లేకుండా మూడు లక్షల రూపాయల రుణాలను అందించేందుకు సిద్ధమయింది.

Update: 2024-08-23 05:26 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీసీలకు గుడ్ న్యూస్ చెప్పింది. వడ్డీ లేకుండా మూడు లక్షల రూపాయల రుణాలను అందించేందుకు సిద్ధమయింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న ప్రధాని విశ్వకర్మ యోజన పథకాన్ని ఆదరణ స్కీమ్ తో కలపాలని నిర్ణయించింది. చేతివృత్తుల పనివారలకు ఊతమందించేందుకు కేంద్ర ప్రభుత్వం విశ్వకర్మ యోజన పథకాన్ని అమలులోకి తెచ్చారు. ఏపీలోనూ ఆదరణ పేరుతో బీసీలకు చేయూత నివ్వాలని నిర్ణయించారు.

రెండు పథకాలను కలిపితే...
ఈ రెండు పథకాలను కలిపితే లబ్దిదారులకు రెండు విడతల్లో మూడు లక్షల రూపాయల వరకూ రుణం కల్పించవచ్చు. దీని వల్ల వృత్తిపనివారలు తమ పనిముట్లను కొనుగోలు చేసుకోవచ్చు. తమ చిరు వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవచ్చు. ఈ పథకం కింద ఎంపికయిన వారికి రెండు విడతల్లో రుణాన్ని మూడు లక్షల రూపాయలు అందచేస్తారు. అయితే బ్యాంకులు ఇందుకోసం పదమూడు శాతం వడ్డీ విధిస్తుంది. ఈ రుణం తీసుకున్న వారికి వడ్డీలో ఎనిమిది శాతం కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది.
పూర్తిగా వడ్డీ లేకుండా...
అయితే మిగిలిన ఐదుశాతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెల్లించగలిగితే పూర్తిగా మూడు లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాలను అందించే వీలుంటుంది. ఇది బీసీలకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ ప్రతిపాదనలను సిద్ధం చేసినట్లు సమాచారం. అయితే ఆదరణ పథకం కింద అర్హులైన లబ్దిదారులు ఎంత మంది ఉన్నారు? వారిలో ఆదరణ పథకం కింద ఈ పథకం వర్తింపచేయడానికి సంబంధించి పూర్తి స్థాయి సర్వే ఏపీలో ప్రారంభమయిందని తెలిసింది. అదే జరిగితే బీసీలకు ఏపీలో పండగ అని చెప్పాలి.


Tags:    

Similar News