ఏపీలో ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్ చెప్పింది. టీచర్ల బదిలీలు, ప్రమోషన్లకు సంబంధించి విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.;

Update: 2024-12-01 07:51 GMT
andhra pradesh government,  good news, teachers, promotions
  • whatsapp icon

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్ చెప్పింది. టీచర్ల బదిలీలు, ప్రమోషన్లకు సంబంధించి విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వరసగా ఉపాధ్యాయులకు పదోన్నతులు, బదిలీలు చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వ టీచర్ల పదోన్నతులు, బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులను విద్యాశాఖ విడుదల చేసింది. ఈ నెల 25, జనవరి 25, ఫిబ్రవరి 10 తేదీల్లో ఉపాధ్యాయుల ప్రొఫైల్ అప్డేషన్ చేస్తారు.

రోడ్ మ్యాప్ ప్రకారం...
ఫిబ్రవరి15, మార్చి 1, 15 తేదీల్లో సీనియారిటీ జాబితా ప్రదర్శిస్తారు.ఏప్రిల్ 10 తేదీ నుంచి 15వ తేదీ వరకు హెడ్ మాస్టర్లు,21వ తేదీ నుంచి 25వ తేదీ వరకు సీనియర్ అసిస్టెంట్లు , మే 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు సెకండరీ గ్రేడ్ టీచర్ల బదిలీలు పూర్తిచేస్తారు.అలాగే ఏప్రిల్ 16వ తేదీ నుంచి 20 వ తేదీ వరకు హెడ్ మాస్టర్లు, మే 26వ తేదీ నుంచి 30వ తేదీ వరకు సీనియర్ అసిస్టెంట్ల ప్రమోషన్లు చేపడతారు.


Tags:    

Similar News