Chandrababu : మోదీ వస్తున్న వేళ చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రకృతి విపత్తుల్లో మరణించిన వారికి ఇచ్చే ఎక్స్ గ్రేషియా పెంచింది;

Update: 2025-01-08 07:15 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రకృతి విపత్తుల్లో మరణించిన వారికి ఇచ్చే ఎక్స్ గ్రేషియా పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో నాలు లక్షల రూపాయలుగా ఉన్న పరిహారాన్ని ఐదు లక్షల రూపాయలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రకృతి విపత్తులతో మరణించిన వారికి కొంత ఊరట లభించే అవకాశం దక్కింది.

వీరికి కూడా...
అలాగే ఆంధ్రప్రదేశ్ లో చేతివృత్తుల వారికి ఇచ్చే సాయాన్ని కూడా పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చేనేత, చేతి వృత్తులు చేసుకునే వారు ముంపుబారిన పడితే ఇచ్చే సాయాన్ని పది వేల రూపాయల నుంచి ఇరవైఐదువేల రూపాయలకు పెంచారు. అలాగే విపత్తుల వేళ నీట మునిగిన ద్విచక్రవాహనాలకు మూడు వేలు, ఆటోలకు పది వేలు ఇవ్వాలని నిర్ణయించింది.


Tags:    

Similar News