Breaking : ఏపీలో ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్... ఇక పరీక్షలు లేవు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్మీడియట్ సిలబస్ లో మార్పులు చేసింది;

Update: 2025-01-08 07:25 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్మీడియట్ సిలబస్ లో మార్పులు చేసింది. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు మొదటి ఏడాది ఖచ్చితంగా ఉత్తీర్ణత సాధించాలన్న నిబంధనను కూడా ఎత్తివేసింది. దీంతో ఏపీలో ఇంటర్ విద్యార్థులకు ఇది వెసులు బాటు ఇచ్చే ఆదేశాలని అధికారుల చెబుతున్నారు. ఇకపై సెకండ్ ఇంటర్ పరీక్షలు మాత్రమే నిర్వహించనున్నారు.

వత్తిడి తగ్గించేందుకే...
విద్యార్థులపై వత్తిడి తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇంటర్ విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. దీంతో పాటు ఫీజులు కట్టలేదని సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం, అడ్మిషన్ల సమయంలో ఒరిజినల్‌ సర్టిఫికెట్లు తీసుకోవడం తదితర ఘటనలపై ఏపీ ప్రభుత్వం సీరియస్‌ అయింది. విద్యార్థుల నుంచి భారీగా ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో కాలేజీలకు హెచ్చరికలు చేసింది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి చైర్మన్‌ కె.మధుమూర్తి మంగళవారం కీలక ప్రకటన జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని, అటువంటి విద్యాసంస్థల అఫిలియేషన్‌ రద్దుచేస్తామని హెచ్చరించారు.


Tags:    

Similar News