Andhra Pradesh : సిట్ లో అధికారులను మార్చిన ప్రభుత్వం
బియ్యం అక్రమ రవాణాపై ఏర్పాటైన సిట్‌లో మార్పులు చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది
బియ్యం అక్రమ రవాణాపై ఏర్పాటైన సిట్‌లో మార్పులు చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రేషన్ బియ్యం ఇతర దేశాలాకు పోర్టుల నుంచి ఎగుమతి అవుతున్న దానిపై దర్యాప్తు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే అందులో అధికారుల నియామకాలపై కొన్ని విమర్శలు వినిపించాయి.
కొత్త అధికారులతో...
సీఐడీ ఐజీ వినిత్ బ్రిజ్‌లాల్ నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో సిట్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గతంలో నియమించిన నలుగురు డీఎస్పీలపై అభ్యంతరాలు రావడంతో మరో నలుగురు సభ్యులు నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది రేషన్ బియ్యంలో జరిగిన అక్రమాలపై నిజానిజాలను వెలికితీయాలని ప్రజలు కోరుకుంటున్నారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now