Breaking : ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. అర్చకులకు గుడ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆలయాల్లో ఇతరుల జోక్యం లేకుండా అర్చకులకు స్వయం ప్రతిపత్తి కల్పించింది;
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆలయాల్లో ఇతరుల జోక్యం లేకుండా అర్చకులకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆలయాల్లో ఇతరుల జోక్యం లేకుండా ఈనిర్నయం తీసుకుంది. వైదిక విధుల్లోనూ, నిర్ణయాలన్లో ఈవో నుంచి దేవాదాయ కమిషనర్ వరకూ ఎవరూ జోక్యం చేసుకోకుండా ఉత్తర్వులు జారీ చేసింది. ఆధ్యాత్మిక విషయాల్లో ఏకాభిప్రాయం కుదరకపోతే పీఠాధిపతులు సూచనలు తీసుకోవాలని పేర్కొంది.
అర్చకులదే నిర్ణయం...
అర్చకులకు ఫ్రీ హ్యాండ్ ఇస్తూ ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఆలయ వైదిక విధుల్లో అధికారుల జోక్యం కారణంగా సంస్కృతి, సంప్రదాయాలు దెబ్బతినే అవకాశముందని భావించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆలయ అభివృద్ధి విషయంలో తప్ప వైదిక విధుల్లో ఇతరులు ఎవరూ జోక్యం చేసుకోవడానికి వీలులేదని ఉత్తర్వుల్లో పేర్కొంది.