Andhra Pradesh : నిరుద్యోగులకు గుడ్ న్యూస్..విద్యుత్తు శాఖలో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగం గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీ విద్యుత్తు శాఖలో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం అందింది

Update: 2024-11-25 06:28 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగం గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీ విద్యుత్తు శాఖలో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం అందింది. ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష ఉండదు. ఈ మేరకు ఉద్యోగాల భర్తీకి ఏపీ ట్రాన్స్‌కో ప్రకటన జారీ చేసింది. విజయవాడలోని ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్‌ ఉద్యోగ నోటిఫికేషన్‌ ఇచ్చింది. ఈ నోటిఫికేషన్‌ కింద కాంట్రాక్ట్ ప్రాతిపదికన ట్రాన్‌కో, ఏపీపీసీసీలో కార్పొరేట్ లాయర్ పోస్టులను భర్తీ చేయనుంది. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆఫ్‌లైన్‌ దరఖాస్తులకు వచ్చే నెల పదో తేదీని చివరి తేదీగా నిర్ణయించింది. ఈ ప్రకటన కింద మొత్తం ఐదు కార్పొరేట్ లాయర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిల్లో ట్రాన్‌కో పోస్టులు ఒకటి, ఏపీపీసీసీలో కార్పొరేట్ లాయర్ పోస్టులు నాలుగు ఉన్నాయి.

అర్హతలివే...
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ లేదా ఎల్‌ఎల్‌ఎం లేదా ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ లా కోర్సులో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే బార్‌ కౌన్సిల్‌లో నాలుగేళ్ల ఉద్యోగానుభవం ఉండాలి. ఎలాంటి వయోపరిమితి లేదు. ఏడాది కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగాలు భర్తీ చేస్తారు. ఎంపికైన వారికి ప్రొఫెషనల్ ఫీజు కింద నెలకు రూ.1,20,000 వరకు చెల్లిస్తారు. ఆసక్తి కలిగిన వారు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ప్రకటన ఇచ్చిన తేదీ నుంచి 21 రోజులలోపు దరఖాస్తులను ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, ఏపీ ట్రాన్స్ కో, విద్యుత్తు సౌధ, గుండాల, విజయవాడకు పంపాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష ఉండదు. విద్యార్హతలు, ఉద్యోగానుభవం, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.


Tags:    

Similar News