ఏపీలో బడ్జెట్ సమావేశాలు ఎప్పుడంటే?
బడ్జెట్ సమావేశాల నిర్వహణకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతుంది.
బడ్జెట్ సమావేశాల నిర్వహణకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఫిబ్రవరి నెలాఖరు లేదా మార్చి మొదటి వారంలో అసెంబ్లీని నిర్వహించాలని భావిస్తున్నారు. పదిరోజుల పాటు బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ సమావేశాల్లో కీలక బిల్లులను ప్రభుత్వం ఆమోదించుకోవాల్సి ఉంటుంది.
పది రోజుల పాటు....
అయితే బడ్జెట్ సమావేశాలకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు దూరంగా ఉండనున్నారు. ఆయన తాను తిరిగి సీఎం అయిన తర్వతనే సభలోకి అడుగు పెడ్తానని చెప్పి వెళ్లిన సంగతి తెలిసిందే. మొత్తం పదిరోజుల పాటు బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తుంది. నేడో, రేపో సమావేశాల తేదీలు ఖరారు కానున్నాయి.