నేడు సీపీఎస్ పై మళ్లీ చర్చలు

సీపీఎస్ పై నేడు ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వం చర్చించనుంది;

Update: 2022-08-24 04:25 GMT
employees unions, government, prc, salaries, andhra pradesh
  • whatsapp icon

సీపీఎస్ పై నేడు ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వం చర్చించనుంది. సీపీఎస్ విషయంలో ప్రభుత్వం తన హామీని నిలబెట్టుకోవాలని సెప్టంబరు 1వ తేదీన మిలియన్ మార్చ్ కు ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరోసారి వారితో చర్చలకు సిద్ధమయింది.

ఓపీఎస్ తీసుకువస్తామని...
సీీపీఎస్ స్థానంలో ఓపీఎస్ తీసుకు వస్తామని ప్రభుత్వం గతంలో చెప్పింది. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాంటూ ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పీసీపీఎస్‌యూఎస్ అధ్యక్ష్య, కార్యదర్శులను కూడా నేడు ప్రభుత్వం చర్చలకు పిలిచింది. ఈరోజు జరిగే సమావేశంలో ప్రభుత్వం నుంచి క్లారిటీ వస్తుందన్న ఆశాభావంతో ఉద్యోగ సంఘాలున్నాయి. లేకుంటే మిలియన్ మార్చ్ ను సెప్టంబరు 1న జరుపుతామని చెబుతున్నాయి. మంత్రి బొత్స సత్యనారాయణ ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు జరపనున్నారు.


Tags:    

Similar News