Andhra Pradesh : నేటి నుంచి ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇక ఇసుక ఫ్రీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేటి నుంచి ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెడుతుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేటి నుంచి ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెడుతుంది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటే ఇసుక విధానంలో మార్పులు తెచ్చారు. ప్రస్తుతం అదుబాటులో ఉన్న ఇసుకను ఉచితంగా తీసుకుని వెళ్లే సౌకర్యాన్ని కల్పించారు. ఇసుక మాఫియాకు తెరదించారు. అయితే ఉచితంగా ఇసుక తీసుకెళ్లే వాళ్లు రవాణా ఛార్జీలను మాత్రం చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 43 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక పంపిణీకి సిద్ధంగా ఉందని అధికారులు తెలిపారు. ఎంపిక చేసిన ఇసుక రీచ్‌లలో ఈ ఇసుకను అందుబాటులో ఉంచేందుకు అధికారులు అంతా సిద్ధం చేశారు. ఉచిత ఇసుక వల్ల నిర్మాణ రంగం మరింత ఊపందుకుంటుందని ప్రభుత్వం భావిస్తుంది.
నిర్మాణ రంగం...
భవన నిర్మాణ కార్మికులకు కూడా చేతినిండా పని దొరుకుతుంది. ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పనిలేకుండా ఉంటుందన్న కారణంతోనే ఈ విధానాన్ని కొత్త ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. కలెక్టర్ల నేతృత్వంలోనే ఇసుక రీచ్ ల పర్యవేక్షణ కొనసాగుతుంది. టన్నకు సీవరేజీ కింద కేవలం టన్నుకు 88 రూపాయలు మాత్రమే వసూలు చేస్తున్నారు. దూరాన్ని బట్టి రవాణా వ్యయం ఉంటుంది. ఆ యా జిల్లాల కలెక్టర్లు టన్ను ఇసుక ధర ఎంత అన్నది నిర్ధారించనున్నారు. దీంతో ఇప్పుడు ఏపీ ప్రజలు ఇల్లు కట్టుకోవాలంటే ఉచిత ఇసుక నేటి నుంచి అందుబాటులోకి రానుంది. ఇది హ్యాపీ న్యూస్ కాక మరేంటి?