ఏపీలో ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు
ఇంటర్ పరీక్షలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది;

ఇంటర్ పరీక్షలకు ఏపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. మార్చి 1వ తేదీ నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు జరగనున్నాయి. వచ్చే నెల 20వ తేదీ వరకూ పరీక్షలు జరుగుతాయి. ఇందుకోసం ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. మార్చి 1త తేదీ నుంచి 19 వరకూ ఇంటర్ ప్రధమ, 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకూ ద్వితీయ సంవత్సర పరీక్షలు జరగనున్నాయి. దీంతో పాటు మార్చి 3వ తేదీ నుంచి 15వ తేదీ వరకూ ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ ఇంటర్మీడియెట్ పరీక్షలు కూడా జరగనున్నాయి.
టోల్ ఫ్రీ నెంబరు...
ఈ పరీక్షలు ఉదయం 9 గంల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకూ జరుగుతాయి. పరీక్షా కేంద్రాల్లో అవసరమైన కనీస సౌకర్యాలు కల్పనకు ఏర్పాట్లు చేయనున్నారు. ఫిర్యాదులు స్వీకరణకు రాష్ట్ర స్థాయిలో కంట్రోల్ రూమ్ నంబరు 1800 425 1531 ఏర్పాటుచేసంది. జిల్లా కేంద్రాల్లో కూడా కంట్రోల్ రూములు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ముందుగానే చేసుకోవాలని జిల్లా కలెక్టర్లకు, విద్యాశాఖ అధికారులకు ప్రభుత్వం ఆదేశించింది.