‍‍Nara Lokesh : ఒక్క ట్వీట్ తో వారికి సూపర్ న్యూస్ చెప్పేశారుగా

ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్ చెప్పారు

Update: 2024-06-25 11:45 GMT

ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్ చెప్పారు. ఆయన తన ట్వీట్ ద్వారా నిరుద్యోగులకు తీపి కబురును అందించారు. త్వరలోనే టెట్ పరీక్ష ఉంటుందని తెలిపారు. టెట్ పరీక్ష నిర్వహించన తర్వాతనే మెగా డీఎస్సీ పరీక్ష ఉంటుందని ఆయన తెలియజేయడంతో ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులకు వరంగా మారబోతుంది. దీంతో నిరుద్యోగులు, గత టెట్ పరీక్షలో అర్హత సాధించిన వాళ్లంతా తిరిగి పరీక్ష రాసేందుకు సిద్ధమవ్వాలని ఆయన పిలుపునివ్వడంతో యువత పండగ చేసుకుంటున్నారు. ఏపీ టెట్ ఫలితాలు విడుదల చేసిన అనంతరం ఆయన ఈ ట్వీట్ చేశారు.

ట్వీట్ ఏం చేశారంటే?
"నిరుద్యోగ టీచర్లు గత మూడునెలలుగా ఎదురుచూస్తున్న ఏపీ టెట్ ఫలితాలను ఈరోజు విడుదల చేశాను. టెట్ లో అర్హత సాధిస్తేనే డిఎస్సీ రాసేందుకు అర్హులు కావడం, డీఎస్సీలో టెట్ మార్కులకు 20శాతం వెయిటేజి ఉండటంతో ఈ ఫలితాల కోసం రాష్ట్రవ్యాప్తంగా 2.35 లక్షలమంది నిరుద్యోగ టీచర్లు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. టెట్ లో అర్హత సాధించిన అభ్యర్థులకు నా శుభాకాంక్షలు. మన ప్రజాప్రభుత్వం ప్రకటించిన మెగా డిఎస్సీ కి అందరూ సన్నద్ధం కావాలని కోరుకుంటున్నాను.ఈ టెట్ లో క్వాలిఫై కాని అభ్యర్థులకు, కొత్తగా బిఈడి, డిఈడి పూర్తిచేసుకున్న వారికిఅవకాశం కల్పిస్తూ త్వరలోనే టెట్ నిర్వహించబోతున్నాం. ఆ తరువాత మెగా డిఎస్సీ ఉండబోతుంది" అని లోకేష్ ట్వీట్ చేశారు.


Tags:    

Similar News