స్పీకర్ అయ్యన్న కీలక నిర్ణయం.. ఆ తర్వాతనే ఇసుక తరలించాలని ఆదేశం

ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక నిర్ణయం తీసుకున్నారు.

Update: 2024-07-08 06:40 GMT

ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. నిందితులెవరో తేల్చకుండా ఇసుకను తరలించడమేంటని ఆయన అధికారులను ప్రశ్నించారు. నర్సీపట్నం గబ్బడ ఇసుక డిపోలో ఉన్న ఇసుక అక్రమ నిల్వల వెనక ఎవరున్నారన్నది నిగ్గు తేల్చాలన్నారు. ఇక్కడ నిల్వ ఉంచిన 65 వేలటన్నుల ఇసుకపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నాటి ప్రభుత్వంలో ఇసుక తవ్వకాలపై అక్రమాలకు పాల్పడిన వారిని గుర్తించి వారిపై కేసులు నమోదు చేయాలని కోరారు.

గుట్టురట్టు చేసిన తర్వాతనే...
ఇసుక మాఫియా గుట్టురట్టును చేసిన తర్వాతనే నిల్వ ఉంచిన ఇసుకను పంపిణీ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దొంగను పట్టుకోకుండా ఇసుకను తరలిస్తే అసలు వాళ్లు తప్పించుకునే అవకాశముందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. విచారణ జరిపి కేసులు నమోదు చేసిన తర్వాత మాత్రమే ఇసుక తరలించాలని ఆయన నర్సీపట్నంలోని అధికారులను ఆదేశించారు. అప్పటి వరకూ ఇసుక పంపిణీని నిలిపి వేయాలని ఆయన కోరారు.


Tags:    

Similar News