ఆమెపై ఎవరూ కామెంట్స్ చేయలేదు

అసెంబ్లీలో జరిగిన ఘటనపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు;

Update: 2021-11-27 12:22 GMT
botsa satyanarayana, minister, pawan kalyan, janasena
  • whatsapp icon

అసెంబ్లీలో జరిగిన ఘటనపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై అసెంబ్లీ సమావేశాల్లో ఎవరూ కామెంట్స్ చేయలేదని వివరణ ఇచ్చారు. లేనిది ఉన్నట్లుగా చంద్రబాబు సృష్టించారని అన్నారు. ఆయన కన్నీరు పెట్టడం కూడా ఒక డ్రామాగా బొత్స సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. మహిళల ఆత్మగౌరవం పేరిట టీడీపీ మరో నాటకానికి తెరలేపిందన్నారు. రోజా కన్నీరు పెట్టినప్పుడు చంద్రబాబుకు ఆత్మగౌరవం గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు.

అధికారంలో ఉన్నప్పడు....
మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తమ పార్టీ సహించబోదని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఇళ్లన్నంటికీ ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తామని చంద్రబాబు చెప్పడంపై ఆయన ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఆ పని ఎందుకు చేయలేదనివ ప్రశ్నించారు.


Tags:    

Similar News