Nara Lokesh : సంక్రాంతికి లోకేష్ స్పెషల్ గిఫ్ట్.. బ్రాహ్మణి రియాక్షన్ ఏంటంటే?

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ త‌న భార్య బ్రాహ్మ‌ణికి సంక్రాంతి పండుగ సంద‌ర్భంగా స్పెష‌ల్ గిఫ్ట్ ఇచ్చారు;

Update: 2025-01-15 05:17 GMT

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ త‌న భార్య బ్రాహ్మ‌ణికి సంక్రాంతి పండుగ సంద‌ర్భంగా స్పెష‌ల్ గిఫ్ట్ ఇచ్చారు. మంగ‌ళ‌గిరిలో త‌యారు చేసిన చేనేత చీర‌ను ఆమెకు బ‌హుమ‌తిగా ఇచ్చారు. ఈ విష‌యాన్ని ఆయ‌న 'ఎక్స్' వేదిక‌గా పంచుకున్నారు. మంగ‌ళ‌గిరి నేత‌న్న‌ల నైపుణ్యం అద్భుత‌మ‌ని, వారికి అండ‌గా నిలుద్దామ‌ని లోకేశ్ ట్వీట్ చేశారు. "ఈ సంక్రాంతికి బ్రాహ్మ‌ణికి ప్ర‌త్యేక మంగ‌ళ‌గిరి చీర‌ను బ‌హుమ‌తిగా ఇవ్వ‌డం గౌర‌వంగా ఉంది. మా మంగ‌ళ‌గిరి చేనేత వ‌స్త్రాల అందం, చేతిప‌ని నిజంగా సాటిలేనివి. ఈ గొప్ప వార‌స‌త్వాన్ని స‌జీవంగా ఉంచే మా నైపుణ్యం క‌లిగిన చేనేత కార్మికుల‌కు మద్దతుగా నిలువ‌డాన్ని కొన‌సాగిద్దాం" అని లోకేశ్ త‌న ట్వీట్‌లో నారా లోకేష్ రాసుకొచ్చారు.

బ్రాహ్మణి రిప్లయ్...
ఇక భ‌ర్త నారా లోకేశ్ ఇచ్చిన ప్ర‌త్యేక‌ బ‌హుమ‌తిపై బ్రాహ్మ‌ణి కూడా రియాక్ట్ అయ్యారు. మంగ‌ళ‌గిరి చేనేత చీర అద్భుతంగా ఉంద‌ని రిప్లై ఇచ్చారు. "థ్యాంక్యూ లోకేశ్‌.. ఈ మంగ‌ళ‌గిరి చీర నిజంగా అద్భుతంగా ఉంది. ఈ సంప్ర‌దాయం, చేనేత‌ప‌ని చాలా గొప్ప‌ది. మ‌న ప్ర‌తిభావంతులైన నేత కార్మికుల ప‌నిని ధ‌రించ‌డం ఒక అదృష్టం. అందరికీ సంతోషం, శ్రేయస్సుతో నిండిన సంక్రాంతి శుభాకాంక్షలు" అని పేర్కొన్నారు.


Tags:    

Similar News