Nara Lokesh : రెడ్ బుక్ లో ఉన్న ఏ ఒక్కరినీ వదలను

రెడ్ బుక్ పై ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ క్లారిటీ ఇచ్చారు. రెడ్ బుక్ లో ఉన్న ఏ ఒక్కరిని వదలనంటూ ఆయన హెచ్చరించారు;

Update: 2024-08-16 07:41 GMT
nara lokesh, minister, modi, visakha

TET exam results 2024

  • whatsapp icon

రెడ్ బుక్ పై ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ క్లారిటీ ఇచ్చారు. రెడ్ బుక్ లో ఉన్న ఏ ఒక్కరిని వదలనంటూ ఆయన హెచ్చరించారు. అన్నా క్యాంటిన్ ను ప్రారంభించిన అనంతరం నారా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ చట్టాన్ని ఉల్లంఘించిన వారిని రెడ్ బుక్కులో చేర్చామన్నారు. తాను ఆ విషయాన్ని రాష్ట్రమంతటా తిరిగినప్పుడు చెప్పానని గుర్తు చేశారు.

రాష‌్ట్రమంతటా తిరిగి...
రెడ్ బుక్ అంటే, చట్టాన్ని ఉల్లంఘించిన వారిని చట్ట ప్రకారం శిక్షించేదని, తాను ప్రతి మీటింగ్ లో, ప్రజలకు రెడ్ బుక్ గురించి చెప్పానన్న నారా లోకేష్ ప్రజలు కూడా చట్టాన్ని ఉల్లంఘించిన వారికి శిక్ష పడాలని తీర్పు ఇచ్చారని తెలిపారు. జోగి రమేష్ కొడుకు భూమి కబ్జా చేసాడని, వదిలేయాలా..❓ అని నారా లోకేష్ ప్రశ్నించారు. రేపు లిక్కర్ స్కాం మీద కూడా చర్యలు ఉంటాయని, ప్రతి స్కాం మీద చట్టప్రకారం చర్యలు ఉంటాయని నారా లోకేష్ ప్రత్యర్థి పార్టీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు.


Tags:    

Similar News