Nara Lokesh : యువగళం హామీ నెరవేర్చారు.. వారందరికీ గుడ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ఎన్నికలకు ముందు సుదీర్ఘంగా యువగళం పాదయాత్ర చేశారు. అర్చకులకు గుడ్ న్యూస్ చెప్పారు;
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ఎన్నికలకు ముందు సుదీర్ఘంగా యువగళం పాదయాత్ర చేశారు. పాదయాత్రలో అనేక సమస్యలు ఆయన దృష్టికి వచ్చాయి. పాదయాత్ర సమయంలో ఎందరో కలసి ఆయనకు తమ సమస్యలను వివరించారు. వారిలో చాలా మందికి తాము అధికారంలోకి వస్తే ఇచ్చిన హామీలను అమలు చేస్తామని ప్రకటించారు.
వార్షిక ఆదాయం తక్కువగా...
ఈ మేరకు వార్షిక ఆదాయం యాభై వేల రూపాయల కన్నా తక్కువ ఉన్న చిన్న ఆలయాలలో పనిచేస్తోన్న అర్చకులకు ఒకప్పుడు నెలకు 2,500 రూపాయలు చెల్లించేవారు. 2015లో తెలుగుదేశం ప్రభుత్వం ఈ మొత్తాన్ని ఐదు వేల రూపాయలకు పెంచింది. యువగళం పాదయాత్రలో నారా లోకేష్ ఇచ్చిన హామీ మేరకు ఇప్పుడు రూ.10,000లకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.