Nara Lokesh : స్వర్ణ దేవాలయాన్నిసందర్శించిన నారా లోకేశ్
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ కుటుంబంతో కలసి స్వర్ణ దేవాలయాన్నిసందర్శించారు;

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ కుటుంబంతో కలసి స్వర్ణ దేవాలయాన్నిసందర్శించారు. అమృత్ సర్ లోని సర్ణదేవాలయానికి వెళ్లిన నారా లోకేశ్, బ్రాహ్మణి,దేవాన్ష్ లు పూజలు నిర్వహించారు. అక్కడ జరిగే ప్రార్థనల్లో పాల్గొన్నారు. అందరూ కలసి తీయించుకున్న ఫొటోలను నారా లోకేశ్ ఎక్స్ లో షేర్ చేసుకున్నారు. సిక్కు సంప్రదాయ ప్రకారం వారు స్వర్ణ దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు జరిపారు.
ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి...
పవిత్ర హర్ మందిర్ సాహిబ్ ను దర్శించుకుని ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేశ ప్రజలందరూ సుఖ శాంతలతో ఉండాలని నారా లోకేశ్ కోరుకున్నారు. నారా లోకేశ్ దంపతులు వరసగా ప్రార్థనాలయాలను సందర్శిస్తున్నారు. ఇటీవల ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరిగిన మహా కుంభమేళాకు వెళ్లి పుణ్యస్నానాలు చేసి వచ్చిన సంగతి తెలిసిందే.