కర్ణాటకలో పర్యటించిన మంత్రుల బృందం

బెంగళూరులో ఏపీ మంత్రులు రాంప్రసాద్, వంగలపూడి అనిత, సంధ్యారాణి పర్యటించారు.;

Update: 2025-01-04 02:22 GMT



బెంగళూరులో ఏపీ మంత్రులు రాంప్రసాద్, వంగలపూడి అనిత, సంధ్యారాణి పర్యటించారు. ఉచిత బస్సు ప్రయాణంపై అక్కడ అధికారులు, పాలకులతో చర్చించారు. ఉచిత బస్సు ప్రయాణం సందర్భంగా కర్ణాటక ప్రభుత్వానికి ఎదురవుతున్న ఇబ్బందులతో పాటు బస్సులో ప్రయాణించి ఈ సౌకర్యం వల్ల మహిళలు ఎంత లబ్ది పొందుతున్నదీ తెలుసుకున్నారు.


సిద్ధరామయ్యతో భేటీ...
అనంతరం కర్ణాటక సీఎం సిద్దరామయ్యతో ఏపి మంత్రుల బృందం భేటీ అయింది. కర్ణాటకలో అమలవుతున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై అధ్యయనం చేసిన ఏపీ మంత్రుల బృందం త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు నివేదిక అందచేయనుంది. కర్ణాటక రవాణా మంత్రి రామలింగారెడ్డి, ఆర్టీసీ అధికారులతో విస్తృత సమావేశం నిర్వహించింది. కర్ణాటక బస్సులో ప్రయాణం చేసి ప్రయాణికులతో పథకం అమలుపై మంత్రులు ఆరా తీశారు.

ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now


Tags:    

Similar News