ఎంత చెబుతున్నా... ఈ మొండి ధైర్యం ఏంటి?
భారీ వర్షాలు కురుస్తుండటంతో ఆంధ్రప్రదేశ్ నదులు పొంగి ప్రవహిస్తున్నాయి.;
భారీ వర్షాలు కురుస్తుండటంతో ఆంధ్రప్రదేశ్ నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. అయినా కొందరు భయం లేకుండా వంతెనలను దాటే ప్రయత్నం చేస్తున్నారు. అనంతపురం జిల్లాలో ఈ ఘటన భయభ్రాంతులకు గురి చేసింది. హిందూపురంలో కొట్నూరు చెరువు వంతెన మీదుగా ప్రవహిస్తుంది.
తృటిలో తప్పిన ప్రమాదం....
అయినా ఒక ప్రయివేటు బస్సు డ్రైవర్ వంతెనను దాటే ప్రయత్నించాడు. మధ్యలోకి రాగానే బస్సు నీళ్లలో చిక్కుకుపోయింది. బస్సులో 30 మంది వరకూ మహిళలున్నారు. వీరంతా హాహాకారాలు చేయడంతో స్థానికులు వచ్చి రక్షించారు. వీరంతా రోజు వారీ కార్మికులుగా తెలుస్తోంది. బస్సు డ్రైవర్ ను స్థానికులు చితకబాదినట్లు తెలిసింది.