Andhra Pradesh : వైసీపీ ఎమ్మెల్యేలు దొంగచాటుగా వస్తున్నారు.. అయ్యన్నసంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.;

ఆంధ్రప్రదేశ్ స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుండా దొంగచాటుగా వచ్చి రిజిస్టర్ లో సంతకాలు పెట్టి వెళ్లిపోతున్నారని అన్నారు. సభలో ప్రశ్నలు వేస్తున్నారని, సభకు మాత్రం రావడం లేదని అయ్యన్నపాత్రుడు అసహనం వ్యక్తం చేశారు. దీనివల్ల మిగిలిన సభ్యులు తమ ప్రశ్నలు రాకుండా అవకాశాన్ని కోల్పోతున్నారని తెలిపారు.
సభకు హాజరు కాకుండా...
దీంతో పాటు సభకు హాజరు కాకుండా అటెండెన్స్ లో సంతకం పెట్టడమేంటని ఆయన ప్రశ్నించారు. ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలుగా నేరుగా సభకు రావాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు కోరారు. ఇలా సభకు హాజరు కాకుండా సంతకం పెట్టి వెళ్లిన వారిలో బాల నాగిరెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్ రెడ్డి తదితరులు ఉన్నట్లు తన దృష్టికి వచ్చిందని, ఇది మంచి పద్ధతి కాదని అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు.