నేడు ఏపీకి కొత్త గవర్నర్
ఆంధ్రప్రదేశ్ కొత్త గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ నేడు విజయవాడ రానున్నారు. ఈ నెల 24న ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు;
ఆంధ్రప్రదేశ్ కు కొత్త గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ నేడు విజయవాడ రానున్నారు. ఈ నెల 24వ తేదీన ఆయన గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇటీవల రాష్ట్రపతి బిశ్వభూషణ్ హరిచందన్ ను ఛత్తీస్‌ఘడ్ కు బదిలీ చేసి ఆయన స్థానంలో ఏపీకి జస్టిస్ అబ్దుల్ నజీర్ ను కొత్త గవర్నర్ గా నియమించిన సంగతి తెలిసిందే. దీంతో కొత్త గవర్నర్ ఈ నెల 24వ తేదీన బాధ్యతలను స్వీకరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
24న ప్రమాణస్వీకారం...
ఈరోజ సాయంత్రం ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి నేరుగా గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి మూడో గవర్నర్ గా జస్టిస్ అబ్దుల్ నజీర్ నియమితులయ్యారు. ఆయన చేత ఈ నెల 24న హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఇందుకు తగిన ఏర్పాట్లను ప్రభుత్వం చేస్తుంది.