Vehicles Repair ఆ ఖర్చును కూడా ఏపీ ప్రభుత్వం కొంత భరిస్తుంది
విజయవాడ వరదల్లో ఎన్నో కుటుంబాలు;
విజయవాడ వరదల్లో ఎన్నో కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ముఖ్యంగా పలు వాహనాలు కూడా నీటిలో మునిగిపోయాయి. వీటికి రిపేర్లు చేయించాలంటే చాలా కష్టమే అని బాధితులు అంటున్నారు. అయితే వాహన యజమానులు ఆదుకోడానికి ప్రభుత్వం కూడా సాయం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. నష్టపోయిన వ్యాపారుల విషయంలో బ్యాంకర్లతో చర్చలు జరుపుతున్నట్టు ఏపీ ప్రభుత్వం తెలిపింది.
వరదల్లో దెబ్బతిన్న, మునిగి పాడైన వాహనాల మరమ్మతులకు అయ్యే ఖర్చులో కొంత భరించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వయంగా చెప్పారు. పాడైన ఇంట్లోని ఉపకరణాల ఖర్చులోనూ కొంత భరించాలని ప్రభుత్వం యోచిస్తోందన్నారు. రిపేరుకు తక్కువ మొత్తం అయితే ప్రభుత్వమే భరించాలని, ఎక్కువ అయితే మాత్రం కొంత వాటి యజమానులు కూడా భరించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మరమ్మతు పనుల కోసం ఆయా వాహన తయారీదారులతో సంప్రదింపులు జరుపుతోంది. వరదల కారణంగా దెబ్బతిన్న ఇంట్లోని ఎలక్ట్రిక్, ప్లంబింగ్, కార్పెంటరీ, పెయింటింగ్‌కు సంబంధించిన మరమ్మతు పనులను ‘అర్బన్ కంపెనీ’కి అప్పగిస్తున్నట్టు చంద్రబాబు తెలిపారు.