బ్రేకింగ్ : రేపు ఢిల్లీకి జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. జగన్ ఢిల్లీ పర్యటన రేపు ఉన్నట్లు అధికారవర్గాలు వెల్లడించాయి.;
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. జగన్ ఢిల్లీ పర్యటన రేపు ఉన్నట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. ప్రధాని నరేంద్ర మోదీని కలిసే అవకాశాలు ఉన్నాయి. దావోస్ నుంచి వచ్చిన తర్వాత జగన్ నేరుగా ఢిల్లీ వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్ర ప్రయోజనాలతోపాటు రాజకీయ పరమైన అంశలను కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీ అపాయింట్ మెంట్ ఖరారు కావాల్సి ఉంది.
రాష్ట్ర ప్రయోజనాలతో....
జగన్ తరచూ ఢిల్లీ వెళుతున్నారు. ప్రధాన నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలతో ఇప్పటికే పలు దఫాలు సమావేశమయ్యారు. పోలవరం ప్రాజెక్టు నిధులతో పాటు రాష్ట్రానికి రావాల్సిన అదనపు నిధులపై కూడా జగన్ చర్చిస్తారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై కూడా జగన్ చర్చించనున్నారు. ప్రధానంగా కోనసీమలో రేగిన అల్లర్ల విషయాన్ని ఢిల్లీ పెద్దల వద్ద ఆధారాలతో సహా ప్రస్తావిస్తారని తెలిసింది.