లోకేష్ ను కూడా ప్రశ్నించాలి: ఏపీ సీఐడీ
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో ప్రధాన నిందితుడు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసింది ఆంధ్రప్రదేశ్ సీఐడీ
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో ప్రధాన నిందితుడు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసింది ఆంధ్రప్రదేశ్ సీఐడీ. సీఐడీ అడిషనల్ డీజీ సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో ఆయన ప్రధాన నిందితుడని, కుట్రదారుడన్నారు. నకిలీ ఇన్‌వాయిస్‌ల ద్వారా షెల్ కంపెనీకి నిధులు మళ్లించారని ప్రభుత్వానికి రూ.371 కోట్లు నష్టం వచ్చింది అన్నారు. నిధుల దారి మళ్లింపునకు సంబంధించి చంద్రబాబును ప్రశ్నించాల్సి ఉందన్నారు. చంద్రబాబును కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయాల్సి ఉందని అన్నారు. స్కిల్ డెవలెప్‌మెంట్ కార్పొరేషన్ వ్యవహారంలో రూ.550 కోట్ల స్కాం జరిగింది అన్నారు. ప్రభుత్వానికి రూ.371 కోట్లు నష్టం జరిగిందని.. నకిలీ ఇన్‌వాయిస్‌లతో షెల్ కంపెనీలకు నిధులు మళ్లించారన్నారు. చంద్రబాబును కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయాల్సి ఉందని.. ఈడీ, జీఎస్టీ కూడా దీనిపై దర్యాప్తు చేశాయన్నారు. ఈ విచారణలో చంద్రబాబు ప్రధాన లబ్ధిదారుడిగా తేలిందని, న్యాయపరంగా అన్ని చర్యలు తీసుకుని అరెస్ట్ చేశామన్నారు. ఈ ఆర్థిక కుట్రకు 10 ఏళ్లు శిక్ష పడే అవకాశం ఉందన్నారు. కేబినెట్ ఆమోదం లేకుండానే నిధులు కాజేసేందుకు కార్పొరేషన్ ఏర్పాటు చేశారన్నారు. గంటా సుబ్బారావుకు నాలుగు పదవులు ఇచ్చారని.. చంద్రబాబు కనుసన్నుల్లోనే ఈ స్కామ్ జరిగిందన్నారు.