ఏపీ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. "మన సంస్కృతి సంప్రదాయాలకు

Update: 2022-01-14 08:12 GMT

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. మొదటి రోజైన భోగి నాడు.. ప్రజలు వేకువ జామునే భోగి మంటలు వేసి.. చేదు జ్ఞాపకాలు, పాతవస్తువులను మంటల్లో వేసి కాల్చేశారు. సంక్రాంతి అంటే.. తెలియనిదేముంది. ఉద్యోగం, వ్యాపారాల పేరుతో ఎక్కడెక్కడో ఉండే వారంతా.. ఈ పండక్కి ఒక్కచోటకి చేరుతారు. అందరూ ఒకేచోట చేరి కలిసి చేసుకునే పెద్ద పండుగే సంక్రాంతి. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

తాజాగా.. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. "మన సంస్కృతి సంప్రదాయాలకు, సొంత గ్రామాలపై మమకారానికి, వ్యవసాయానికి, రైతులకు మనమంతా ఇచ్చే గౌరవానికి ప్రతీక సంక్రాంతి. భోగి మంటలు, రంగవల్లులు, పండుగ తెచ్చే సంబరాలతో ప్రతి ఇంటా ఆనందాలు వెల్లివిరియాలని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటూ.. ప్రజలందరికీ భోగి, మ‌క‌ర సంక్రాంతి, క‌నుమ శుభాకాంక్ష‌లు." అని పేర్కొంటూ సీఎం జగన్ ట్విట్టర్ వేదికగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.



Tags:    

Similar News